Telangana: తెలంగాణ జిల్లాలోని తాజా వార్తలు

Telanganan Latest news
x

తెలంగాణ లేటెస్ట్ న్యూస్ 

Highlights

Telangana: తెలంగాణలో పలు జిల్లాల్లోని తాజా వార్తలు

తెలంగాణలో పలు జిల్లాల్లోని తాజా వార్తలు:

సిద్దిపేట:

దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి స్వచ్ఛ బడిని సిద్దిపేటలో ప్రారంభమైంది. పట్టణ ప్రజల ఆరోగ్యం కోసమే ఈ స్వచ్ఛ బడి నిర్మాణం జరిగిందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఒక్క సిద్దిపేట నుంచే రోజుకు 40 టన్నుల చెత్త బయటకు వస్తోందని మంత్రి వెల్లడించారు. 60శాతం తడి చెత్త, 35శాతం పొడి చెత్తతో పాటు 5శాతం హానికరమైన చెత్త వస్తోందన్నారు. సిద్దిపేటను చెత్త రహిత పట్టణంగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని అన్నారు మంత్రి హరీష్ రావు.

మహబూబాబాద్ జిల్లా:

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం లైన్ తండాలో తాగునీటి కోసం గ్రామస్తులు అల్లాడిపోతున్నారు. మిషన్ భగీరథ పైపులు అలంకారంగా మిగిలిపోయాయని ఆరోపిస్తున్నారు. మంచినీటి కోసం వ్యవసాయ బావులను ఆశ్రయిస్తున్న ప్రజలు అధికారులు తమ సమస్యను తీర్చాలని వేడుకుంటున్నారు.

మెదక్ జిల్లా:

మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట, తోనిగండ్ల దంతేపల్లి, కాట్రియాల అడవుల్లో మూగజీవుల దాహార్తిని తీర్చేందుకు అటవీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాసర్ ఫీట్స్ ఏర్పాటుచేసి వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా:

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బైకిస్ట్‌ రెచ్చిపోయాడు. హెల్మెట్‌ లేదని పోలీసులు ఆపినందుకు వారిపై తిరగబడ్డాడు. నడిరోడ్డుపై నానా హంగామా చేస్తూ పోలీసులను బండ బూతలు తిట్టాడు. పోలీసులకు జీతం చెల్లిస్తోంది ప్రజలేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హల్‌చల్‌ చేశాడు.

సంగారెడ్డి జిల్లా:

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఉద్యోగాల పేరుతో లక్షల రూపాయలు వసూలుచేసి నిరుద్యోగులను ముంచిన మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేశ్, రమేష్‌, విష్ణువర్దన్‌రెడ్డి, సుమిత్ ఇలా అనేక మారు పేర్లతో పలువురిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.

నిజామాబాద్‌ జిల్లా:

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండటంతో బాధితులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. కోవిడ్ పేషెంట్స్ కోసం కేటాయించిన బెడ్స్ మొత్తం ఫుల్‌ అయ్యాయి. ప్రస్తుతం ఐసీయూలో 70మంది చికిత్స పొందుతున్నారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లా:

నాగర్‌కర్నూల్‌ జిల్లా పెంట్లవెల్లిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రెండు గుంటల భూమి కోసం పరస్పరం కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. దాంతో, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories