Hyderabad: బండి సంజయ్‌ అభ్యర్థనపై స్పందించిన మహిళా కమిషన్‌

Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు రాష్ట్ర మహిళా హక్కుల కమిషన్ తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది.

Arun Chilukuri
Updated on: 15 March 2023 7:30 PM IST
Telangana Women Commission Asked Bandi Sanjay to Come on 18th March
X

Hyderabad: బండి సంజయ్‌ అభ్యర్థనపై స్పందించిన మహిళా కమిషన్‌

Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు రాష్ట్ర మహిళా హక్కుల కమిషన్ తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 18న ఉదయం 11 గంటలకు కమిషన్ ముందు హాజరుకావాలని బండి సంజయ్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. అయితే ఈనెల 15నే కమిషన్ ఎదుట హాజరుకావాలని నోటీసులు జారీచేసినా కవితపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరగా పార్లమెంటు సమావేశాలు ఉన్నందున 15న హాజరుకాలేనని..18న హాజరవుతానని బండి సంజయ్ మహిళా కమిషన్‌కు లేఖ రాశారు. బండి సంజయ్ విజ్క్షప్తికి మహిళా కమిషన్ అంగీకరించింది. ఈనెల 18న ఉదయం 11 గంటలకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story