Telangana: ఈటల యాక్షన్ ప్లాన్ ఏంటి.. పార్టీకి, పదవికి రాజీనామా ప్రకటించబోతున్నారా..?

Telangana: ఈటల యాక్షన్ ప్లాన్ ఏంటి.. పార్టీకి, పదవికి రాజీనామా ప్రకటించబోతున్నారా..?
x

ఈటల రాజేందర్(ఫైల్ ఇమేజ్ )

Highlights

Telangana: ఈటల రాజేందర్ కదలికలు తెలంగాణలో హాట్‌ టాపిక్‌గా మారాయి.

Telangana: ఈటల రాజేందర్ కదలికలు తెలంగాణలో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఆయన తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కొత్త పార్టీ వైపు మొగ్గుతారా లేక వేరే పార్టీలో చేరుతారా అన్న ప్రశ్నకు ఇప్పటికైతే సమాధానం దొరకలేదు. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా..? లేక పార్టీ అధిష్టానం సాగనంపేదాకా చూస్తారా అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

భూకబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ భవిష్యత్ యాక్షన్ ప్లాన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ప్యూచర్‌ ప్లాన్ కోసం సొంత నియోజకవర్గానికి వెళ్లిన ఈటల అనుచరులు పార్టీ నేతలు, కార్యకర్తలతో చర్చించి వచ్చారు. అయితే ఈటల మనసులో ఏముందన్నది అంతుచిక్కడం లేదు. హుజురాబాద్‌ పర్యటనలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారనుకుంటే మళ్లీ వాయిదా వేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా విషయంపై కూడా ఇంకా ఎటూ తేల్చలేదు. సరైన సమయంలో నిర్ణయం ఉంటుందంటూ మళ్లీ దాటవేత ధోరణినే అనుసరించారు.

ఒకవైపు దేవరయాంజాల్ భూముల విషయంలో రాజకీయ రగడ నడుస్తుండగానే మరోవైపు ప్రతిపక్షాలు రంగంలోకి దిగి అధికార పార్టీ నేతల ఆస్తులపై గురి పెట్టాయి. దీంతో ఈటల ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అభిమానులు, కార్యకర్తల నుంచి కూడా భిన్న అభిప్రాయాలు రావడంతో ఈటల ఆలోచనలో పడ్డారు. మరికొంత మందితో చర్చించి సరైనా నిర్ణయం తీసుకోవాలని డిసైడ్‌ అయ్యారట.

ఇప్పటికే కొండా విశ్వేశ్వర్ రెడ్డితో ఈటల చర్చలు జరిపారు. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌తో జత కట్టారు. పలువురు ముదిరాజ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలతో నిరంతరం చర్చలు జరుపుతున్నారు. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి..? వాటిని ఎలా ఎదుర్కొవాలి అనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. భవిష్యత్తులో తనతో కలిసి వచ్చేవాళ్లెవరు ఎవరెవరిని కలుపుకుని ముందుకెళ్లాలి వంటి లెక్కలను ఆయన బేరీజు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇటు టీఆర్ఎస్‌ అధిష్టానం కూడా ఈటల వ్యవహారంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. హుజురాబాద్‌ నియోజకవర్గంపై పట్టు సాధించే వరకు ఈటల ఎపిసోడ్‌ని పెండింగ్‌లో పెట్టాలని చూస్తుందట. నియోజకవర్గంపై క్లారిటీ రాగానే ఈటలను పార్టీ నుంచి ఎమ్మెల్యే పదవి నుంచి దూరం చేసేందుకు స్కెచ్‌ రెడీ చేసినట్లు సమాచారం. మొత్తంగా గులాబీ బాస్‌ నిర్ణయాన్ని బట్టి తాను నిర్ణయం తీసుకోవాలని ఈటల యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరో ఒకటి,రెండు రోజుల్లో ఈటల యాక్షన్ ప్లాన్‌పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories