TS Weather Report: తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి వర్షాలు

Telangana Weather Report Today Raining for 2 Days | Weather News Today
x

తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి వర్షాలు

Highlights

TS Weather Report: * తెలంగాణలో సాధారణంగా రుతుపవనాల కదలికలు * హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం

TS Weather Report: తెలంగాణలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని, వీటి ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మరోవైపు పశ్చిమ, వాయవ్య భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణలోకి గాలులు వీస్తున్నట్టు పేర్కొంది. రాష్ట్రంలో నిన్న పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.

హైదరాబాద్‌లో తెల్లవారుజాము నుంచి పలు చోట్ల వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అప్పటికప్పుడు మేఘాలేర్పడి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భానుడు తన ప్రతాపం చూపించాడు. ఖమ్మం జిల్లా నాగులవంచలో అత్యధికంగా 38 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories