తెలంగాణలో పెరిగిన ఎండల తీవ్రత.. రానున్న ఐదారు రోజుల్లో మరింత పెరిగే...

Telangana Weather Report Today 17 03 2022 High Temperatures Recorded | TS Weather Forecast Today
x

తెలంగాణలో పెరిగిన ఎండల తీవ్రత.. రానున్న ఐదారు రోజుల్లో మరింత పెరిగే...

Highlights

Weather Report Today: వాతావరణంలో అనూహ్యంగా చోటుచేసుకున్న మార్పులు...

Weather Report Today: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఉదయం నుండే ఎండ తీవ్రత పెరగటంతో ఇళ్లలో నుండి బయటకు వచ్చిన వాళ్ళు ఇబ్బందులు పడ్తున్నారు. రానున్న అయిదు రోజులు ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.

నిన్న మొన్నటి వరకు తీవ్రమైన చలి గాలులతో ఇబ్బందులు పడిన జనాలు ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలతో విలవిలాడుతున్నారు. రెండ్రోజుల క్రితం వరకు సాధారణ వాతావరణం ఉండగా.. వాతావరణ మార్పులతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి.

బుధవారం పలుచోట్ల సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 డిగ్రీల నుంచి 5.2 డిగ్రీల సెల్సియస్‌ అధికంగా నమోదు కావడం గమనార్హం. రానున్న అయిదు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే అత్యధికంగా నల్గొండ కేంద్రంలో 41.5 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. ఇది సాధారణం కంటే 5.2 డిగ్రీల సెల్సియస్‌ అధికమని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు.

రానున్న ఐదురోజులు రాష్ట్రవ్యాప్తంగా పలు జిలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్‌ జిల్లాతో పాటు ఉమ్మడి రంగారెడ్డి, కరీంనగర్‌ జిల్లాలో సాధారణం కంటే ఒకటి రెండు డిగ్రీలు అధికంగా, మిగతా జిల్లాల్లో 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్‌ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.

ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కారణంగా బయయకు వచ్చే వారు పలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.డీ హైడ్రేషన్ కు అవకాశం ఉంటుందని నీరు ఎక్కువ తీసుకోవాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారి నాగరత్న.

Show Full Article
Print Article
Next Story
More Stories