Weather Update: తెలంగాణకు రెయిన్ అలర్ట్

Weather Update: తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేశారు.

Arun Chilukuri
Published on: 8 Oct 2025 11:14 AM IST
Weather Update: తెలంగాణకు రెయిన్ అలర్ట్
X

Weather Update: తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేశారు. రానున్న రెండ్రోజులు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని.. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ నగరంలోనూ నేడు పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

తెలంగాణలో గతకొన్ని రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు తిరోగమనంలో రాష్ట్రం విడిచి వెళ్లిపోతున్నా.. బంగాళాఖాతంలో అల్పపీడనం, ద్రోణి ప్రభావాలతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణకు మరోసారి వర్షం హెచ్చరికలు జారీ అయ్యాయి. అక్టోబర్ నెలంతా కూడా రాష్ట్రంలో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో రెండ్రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వానలు కురుస్తాయని తెలిపారు.

యాదాద్రి భువనగిరి, నల్గొండ, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, సూర్యాపేట, ఖమ్మం, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో నేడు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తీవ్ర వడ గాలులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపారు. రానున్న రెండ్రోజులు ఈ జిల్లాల్లో వానలకు ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక గడిచిన మూడు రోజులుగా హైదరాబాద్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story