VC Ravinder: తెలంగాణ యూనివర్సిటీ వీసీ సంచలన వ్యాఖ్యలు

VC Ravinder: ప్రొఫెసర్లు కక్షపూరిత కుట్రలు చేస్తున్నారని ఆరోపణ

Sandeep Eggoju
Updated on: 18 Oct 2021 3:55 PM IST
Telangana University VC Ravinder Gupta Sensational Comments on Professors
X

తెలంగాణ వీసీ రవీందర్ (ఫైల్ ఇమేజ్)

VC Ravinder: నిజామాబాద్‌ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. యూనివర్సిటీలో కొందరు ప్రొఫెసర్లు కక్ష పూరిత కుట్రలు చేస్తున్నారని వీసీ ఆరోపించారు. మాజీ రిజిస్ట్రార్ శివశంకర్ విద్యార్థి నాయకులతో కలిసి తమపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓ దళితుడిని రిజిస్ట్రార్‌గా చేస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. విద్యార్థి సంఘాలు బ్లాక్ మెయిల్ చేస్తున్నాయని ఆరోపించారు.

ప్రొఫెసర్ శివశంకర్ తో పాటు నలుగురు విద్యార్థి నాయకులపై కేసు పెట్టబోతున్నట్లు వెల్లడించారు. పాలకవర్గంలోని ఈసీ మెంబర్లు కూడా సహకరించడం లేదున్నారు. అవసరమైతే కుట్రలు చేసే ప్రొఫెసర్లను రీకాల్‌ చేస్తామన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story