Group 1 Exam Pattern: తెలంగాణ గ్రూప్ 1 సిలబస్.. పరీక్ష విధానం..!

Telangana TSPSC Group 1 Syllabus Exam Pattern
x

Group 1 Exam Pattern: తెలంగాణ గ్రూప్ 1 సిలబస్.. పరీక్ష విధానం..!

Highlights

Group 1 Exam Pattern: తెలంగాణలో గ్రూప్‌ వన్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.

Group 1 Exam Pattern: తెలంగాణలో గ్రూప్‌ వన్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 19 కేటగిరీలకి సంబంధించి 503 పోస్టులని భర్తీ చేస్తున్నారు. మే 2వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుకు మే 31ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు. అభ్యర్థులు టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్ (https://www.tspsc.gov.in/website) లో ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే గ్రూప్ వన్ సిలబస్, పరీక్ష విధానం గురించి తెలుసుకుందాం.

వాస్తవానికి గ్రూప్-1 సర్వీసెస్ ఎగ్జామినేషన్ మనకి రెండు దశల్లో జరుగుతుంది. మొదటిగా ప్రిలిమినరీ పరీక్ష. రెండోది మెయిన్స్‌. టిఎస్పిఎస్సి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష 150 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఈ పరీక్ష లో క్వాలిఫై అయిన వారు రెండో దశలో నిర్వహించే మెయిన్స్ ఎగ్జామ్ కి అర్హత సాధిస్తారు. ప్రిలిమ్స్ చూసుకున్నట్లయితే మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఈ టాపిక్స్ మీద క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మెయిన్స్ పరీక్ష చూసుకున్నట్లయితే పూర్తిగా రాత పరీక్ష . జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్ కలుపుకుని మొత్తం ఏడు పేపర్లుగా ఉంటుంది.

మెయిన్స్ ఎగ్జామినేషన్:

జనరల్ ఇంగ్లీష్ (క్వాలిఫైయింగ్ టెస్ట్)

పేపర్-1 జనరల్ ఎస్సై.

పేపర్-2 హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ.

పేపర్-3 ఇండియన్ సొసైటీ కానిస్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్.

పేపర్-4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్

పేపర్-5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్

పేపర్-6 తెలంగాణ మూ మెంట్స్ అండ్ స్టేట్ ఫార్మేషన్.

ఈ 6 పేపర్స్ కలిపి 900 మార్కులు అంటే ప్రతి పేపర్ 150 మార్కులకు ఉంటుంది.

మెయిన్స్ ఎగ్జామ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి గతంలో ఇంటర్వ్యూ ఉండేది. దానికి 100 మార్కులు కేటాయించేవారు. మొత్తం కలిపి 1000 మార్కులకు గ్రూప్-1 జరిగేది. కానీ ఇప్పుడు ఇంటర్వూలు ఎత్తేశారు. దీంతో 900 మార్కులకే గ్రూప్ వన్‌ నిర్వహిస్తున్నారు. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం గ్రూప్స్‌ పోస్టులకి వయోపరిమితి కూడా పెంచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories