Top
logo

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై టీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్.. తెలంగాణ భవన్‌లో కొనసాగుతున్న కీలక సమావేశం

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై టీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్.. తెలంగాణ భవన్‌లో కొనసాగుతున్న కీలక సమావేశం
X
Highlights

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై టీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. గ్రేటర్‌ పీఠం దక్కించుకోవడానికి కసరత్తు మొదలు...

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై టీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. గ్రేటర్‌ పీఠం దక్కించుకోవడానికి కసరత్తు మొదలు పెట్టింది. ఇదే ప్రధాన అంశంగా తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన ఎల్పీ సమావేశం కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రచార అస్త్రాలను కేసీఆర్‌ నేతలకు వివరిస్తున్నట్లు సమాచారం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు జీహెచ్ఎంసీ పరిధిలోని డివిజన్ల బాధ్యత అప్పగించారు. ఇప్పటికే నేతలకు వారికి అప్పగించిన డివిజన్ల వివరాలను అందించారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాన్ని మార్చిపోవాలని నేతలకు సూచించారు. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత అసమ్మతులు, అసంతృప్తులతో ఎలా వ్యవహరించాలి విపక్షాల ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలి ఏయే అంశాలను ప్రచారంలోకి తీసుకెళ్లాలి అనే అంశాలపై పార్టీ నేతలకు కేసీఆర్ నిశానిర్దేశం చేస్తున్నారు.

Web TitleTelangana: TRS legislative and parliamentary party meeting started
Next Story