చిన్నచిన్న సమస్యలు వస్తాయి...భయపడొద్దు : డీఎంఈ రమేష్ రెడ్డి

Telangana to Start Covid Vaccination Tomorrow
x
Highlights

రేపట్నుంచి ప్రారంభం కానున్న వ్యక్సినేషన్‌కు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు రాష్ట్రవ్యాప్తంగా 139 కేంద్రాలంలో వ్యాక్సిన్ ప్రక్రియ...

రేపట్నుంచి ప్రారంభం కానున్న వ్యక్సినేషన్‌కు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు రాష్ట్రవ్యాప్తంగా 139 కేంద్రాలంలో వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. తొలి విడతలో 3లక్షల 30 వేల మందికి వ్యాక్సిన్ అందించనున్నట్లు శ్రీనివాస రావు స్పష్టం చేశారు. వ్యాక్సిన్ ప్రక్రియలో భాగంగా ఎలాంటి రియాక్షన్ వచ్చినా ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్ కోసం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రేపు ప్రతి కేంద్రంలో 30మందికి మాత్రమే వ్యాక్సిన్ వేయనున్నట్లు తెలిపిన శ్రీనివాస రావు రాష్ట్రవ్యాప్తంగా రేపు నాలుగు వేల మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపారు.

మరోవైపు 50 వేల మంది సిబ్బంది వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొంటారని హెల్త్ డైరెక్టర్ తెలిపారు. గాంధీ, నర్సింగ్ రూరల్ హెల్త్ సెంటర్‌లలో వ్యాక్సిన్ తీసుకున్నవారితో రేపు ప్రధాని మోడీ మాట్లాడుతారని తెలిపారు. ఇప్పటివరకు 3లక్షల, 15వేల మంది వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకున్నట్లు శ్రీనివాస రావు తెలిపారు. అలాగే వారంలో నాలుగురోజులే వ్యాక్సినేషన్ జరుగుతోందని ఆ తర్వాత దశలవారీగా కేంద్రాల పెంచనున్నట్లు హెల్త్ డైరెక్టర్ తెలిపారు.

ఇక వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత జరిగే పరిణామాలపై డీఎంఈ రమేష్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. వ్యాక్సిన్ తర్వాత జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న రమేష్ రెడ్డి దానిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. లక్షల్లో ఒకరికి మాత్రమే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందన్నారు. చిన్న చిన్న సమస్యలపై భయపడాల్సిన పనిలేదన్నారు. అలాగే ఒకరిద్దరికి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చని అలాంటి సమయంలో ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఎమ్‌ఈ రమేష్ రెడ్డి స్పష్టం చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories