నేటి నుంచి నాన్‌ అగ్రికల్చర్‌ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం

నేటి నుంచి నాన్‌ అగ్రికల్చర్‌ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం
x
Highlights

ఆస్తి అమ్మకపుదారులకు, కొనుగోలుదారులకు శుభవార్త మూడునెలలుగా నిలిచిన రిజిస్ట్రేషన్లు నేటి నుంచి షురు కానున్నాయి. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ఆస్తుల...

ఆస్తి అమ్మకపుదారులకు, కొనుగోలుదారులకు శుభవార్త మూడునెలలుగా నిలిచిన రిజిస్ట్రేషన్లు నేటి నుంచి షురు కానున్నాయి. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ఆస్తుల అమ్మకాలు ఆగిపోయాయి. అవసరమైన సమయంలో అమ్ముకోలేక సామాన్యులు ఇబ్బందులుపడ్డారు. ఇక హైకోర్టు ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వెంటనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్​ను ఆదేశించారు.

ధరణి ద్వారా కాకుండా పాత పద్దతిలో రిజిస్ట్రేషన్లకు హైకోర్టు అనుమతి తెలిపింది. స్లాట్‌ బుకింగ్‌ విధానంతో కంప్యూటర్‌ ఆధారిత పద్దతిలో రిజిస్ట్రేషన్లకు కోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ నేటి నుంచి నాన్ అగ్రికల్చర్ ఆస్తులు పాతపద్ధతిలోనే రిజిస్ట్రేషన్లను ప్రారంభిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ 29న ప్రారంభించిన ధరణి పోర్టల్‌ వివాదం కావడంతో హైకోర్ట్ విచారణ చేపట్టింది. సర్వేలో అనవసర వివరాలు తీసుకోవడంతో పాటు డేటా సెక్యూరిటీపై అనుమానాలున్నాయని కోర్టు స్టే విధించింది. ఇక అప్పటి నుంచి తెలంగాణలో నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఇదే విషయాన్ని అడ్వకేట్ జరనల్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని హైకోర్టును అడ్వకేట్ జనరల్ కోరారు. అయితే, పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.

రాష్ట్రంలో నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ సేవలను నిలిపివేసి సుమారు మూడు నెలలయింది. ఆస్తుల రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో దాదాపు లక్షల సంఖ్యలో సేల్​ డీడ్ లు నిలిచిపోయినట్టు రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రతి నెల రూ. 450 కోట్ల ఆదాయం రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి వచ్చేది. ఈ లెక్కన సుమారు రూ.1,350 కోట్ల ఆదాయాన్ని రిజిస్ట్రేషన్ల శాఖ కోల్పోయింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్లకు అనుమతి రావడంతో ఇటు రియల్ ఎస్టేట్ కూడా పుంజుకోనుంది.

రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో జనం ఇన్నాళ్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక తప్పని పరిస్థితుల్లో పాత విధానంలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. దీంతో అమ్మకపు దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటు రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయం కూడా పెరుగనుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories