తెలంగాణలో చలి పంజా.. పగటి, రాత్రిపూట పతనమైన ఉష్ణోగ్రత

తెలంగాణలో చలి పంజా.. పగటి, రాత్రిపూట పతనమైన ఉష్ణోగ్రత
x

తెలంగాణలో చలి పంజా.. పగటి, రాత్రిపూట పతనమైన ఉష్ణోగ్రత

Highlights

తెలంగాణలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పతనమయ్యాయి. మోంథా తుపాను ప్రభావం పూర్తిగా తగ్గడంతో వర్షాలు ఆగిపోయాయి.

తెలంగాణలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పతనమయ్యాయి. మోంథా తుపాను ప్రభావం పూర్తిగా తగ్గడంతో వర్షాలు ఆగిపోయాయి. ఆ తర్వాత వాతవరణంలో నెలకొన్న మార్పులు.. పోడి వాతావరణ ప్రభావంతో తగ్గుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ మేర ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అక్టోబర్‌ నెలాఖరుకల్లా ఉష్ణోగ్రతలు తగ్గుదల నమోదు కావాల్సి ఉండగా.. ఈసారి కాస్తా ఆలస్యంగానే ఉష్ణోగ్రతల పతనం నమోదైంది. దీంతో చలి ప్రభావం కనిపిస్తుంది.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రత పడిపోయింది. లింగపూర్‌లో 15.2 డిగ్రీలుగా ఉంది. జిల్లాలోని పలు గ్రామాలను ఉదయం పొగ మంచు కమ్మేసింది. ఉదయం 8 అయిన సూర్యోదయం కనిపించలేదని అక్కడి స్థానికులు చెప్తున్నారు. దీంతో చలి ప్రభావం వల్ల వాహనదారులు లైట్లు వేసుకొని ప్రయాణం సాగించారు. వృద్ధులు, పిల్లలు చలి తీవ్రతకు ఇంట్లో నుండి బయటకు రావడానికి జంకుతున్నారు.

ప్రస్తుతానికి ఎలాంటి వాతావరణ హెచ్చరికలు లేవని అధికారులు అంటున్నారు. వాతావరణంలో నెలకొనే మార్పులతో అక్కడక్కడా తేలికపాటి వానలు కురుసే అవకాశం ఉందని.. ఈ పరిస్థితుల్లో ఉష్ణోగ్రతలు పతనం క్రమంగా ఉంటుదని వాతావరణ శాఖ‌ అధికారులు వివరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories