Hyderabad: భాగ్యనగరానికి పండుగ శోభను తెచ్చిన హ్యాండ్‌బాల్ టోర్నమెంట్

*ఫైనల్స్‌లో రాజస్థాన్‌పై నెగ్గిన తెలంగాణ జట్టు *ముగింపు వేడుకలకు హాజరైన ఎమ్మెల్సీ కవిత

Shilpa
Published on: 11 Oct 2021 10:13 AM IST
Telangana Team Defeated Rajasthan in Handball Tournament Finals
X

భాగ్యనగరానికి పండుగ శోభను తెచ్చిన హ్యాండ్‌బాల్ టోర్నమెంట్(ఫైల్ ఫోటో)

Handball Tournament-Hyderabad: కరోనాతో ఏడాదిన్నరగా ఒక్క జాతీయస్థాయి క్రీడా పోటీ జరగక చిన్నబోయిన భాగ్యనగరానికి హ్యాండ్‌బాల్ టోర్నమెంట్ పండుగ శోభను తెచ్చింది. ఫైనల్లో తెలంగాణ జట్టు రాజస్థాన్‌పై నెగ్గి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కవిత, ఐటీ శాఖ ప్రభుత్వ కార్యదర్శి జయేష్ రంజన్‌తో కలిసి విజేతకు ట్రోఫీ బహుకరించారు. విజేతగా నిలిచిన తెలంగాణ జట్టును ప్రత్యేకంగా అభినందించారు. కాగా సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో 4 రోజులుగా జరుగుతున్న 37వ జాతీయ సబ్ జూనియర్ బాలుర హ్యాండ్‌బాల్ చాంపియన్ షిప్ ఆదివారం ముగిసింది.

Shilpa

Shilpa

Next Story