TDP: తెలంగాణలో టీడీపీకి బిగ్‌షాక్.. గులాబీ గూటికి టీటీడీపీ అధ్యక్షుడు

TDP: ఎల్‌.రమణతో టీఆర్ఎస్ నేతల మంతనాలు * రమణతో సంప్రదింపులు జరిపిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

Sandeep Eggoju
Published on: 7 Jun 2021 5:58 PM IST
Telangana TDP President L Ramana Joined in TRS Party
X

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ (ఫైల్ ఇమాజ్)

TDP: తెలంగాణలో టీడీపీకి బిగ్‌షాక్ తగిలింది. టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎల్ రమణ్ టీఆర్ఎస్‌ కండువ కప్పుకోనున్నారు. అందుకోసం టీఆర్ఎస్ నేతలతో ఎల్ రమణ మంతనాలు జరుపుతున్నారు. రమణతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంప్రదింపులు చేసినట్టు తెలుస్తోంది. అయితే.. గులాబీ కండువా కప్పుకుంటే ఎమ్మెల్సీ పదవీ కూడా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. అయితే.. ఇప్పటికే రమణతో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన రమణకు బీసీ వర్గాల్లో మంచి గుర్తింపు ఉంది. బీసీ నాయకుడి స్థానాన్ని మరొక బీసీ నేతతోనే భర్తీ చేసేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఎల్ రమణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత నుంచి టీటీడీపీ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. రమణతో పాటు టీఆర్ఎస్‌లోకి పలువురు టీటీడీపీ నాయకులు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు.. పార్టీ మారడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎల్ రమణ తెలిపారు. జూన్ 1న మంత్రి ఎర్రబెల్లి ఫోన్ చేసినట్టు వెల్లడించారు. రమణను సీఎం కేసీఆర్ గుర్తు చేసినట్టు మంత్రి ఎర్రబెల్లి ఎల్‌.రమణతో చెప్పారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story