Telangana: జూనియర్‌ డాక్టర్ల చర్చలు సఫలం..స్టైఫండ్‌ పెంపు

Telangana: తెలంగాణలో జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri
Published on: 27 May 2021 5:48 PM IST
Telangana: Stipend Hike for Senior Govt Doctors
X

Telangana: జూనియర్‌ డాక్టర్ల చర్చలు సఫలం..స్టైఫండ్‌ పెంపు

Telangana: తెలంగాణలో జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ తెలంగాణలో జూనియర్‌ డాక్టర్లు చేపట్టిన సమ్మెకు ఎట్టకేలకు పరిష్కారం దొరికింది. గురువారం జూడాలతో చర్చలు జరిపిన తర్వాత 15 శాతం స్టైఫండ్‌ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన స్టైఫండ్ ఈ ఏడాది జనవరి నుంచి వర్తింపజేయనున్నట్టు ప్రకటించింది. అలాగే, సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనాన్ని 70వేలు నుంచి 80వేల 500 రూపాయలకు పెంచింది. జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్, సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనంపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story