Mahmood Ali Covid19 Positive: తెలంగాణలో కరోనా పంజా.. హోంమంత్రి కుటుంబం మొత్తానికి పాజిటివ్..

Arun Chilukuri
Published on: 29 Jun 2020 4:54 PM IST
Mahmood Ali Covid19 Positive: తెలంగాణలో కరోనా పంజా.. హోంమంత్రి కుటుంబం మొత్తానికి  పాజిటివ్..
X

Mahmood Ali Covid19 Positive: తెలంగాణలో ప్రజాప్రతినిధులను కరోనా భయం వెంటాడుతోంది. ముఖ‌్యంగా అధికార టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను కోవిడ్ కంగారు పెడుతోంది. ఇప్పటికే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌ కోవిడ్‌ బారిన పడగా, తాజాగా రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ కూడా ఈ జాబితాలో చేరారు. హోం మంత్రి మహమూద్‌ అలీకి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయన మూడు రోజుల క్రితం కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ టెస్ట్ లలో మహమూద్ ఆలీకి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హోం మంత్రి మహుమ్మద్ అలీ తో పాటు అతని కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

హోంమంత్రి తో పాటు అతని మనవడికి కరోనా పాజిటివ్ రావడంతో అపోలో హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు. ఇక హోం మంత్రి కొడుకు, అల్లుడికి కూడా కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. హోమ్ క్వరంటాయిన్ లో హోం మంత్రి కొడుకు, అల్లుడు ఉన్నారు. వారం రోజుల క్రితం హోం మంత్రి గన్ మెన్స్ 6 గురికి కరోనా సోకింది. దాంతో అనుమానం వచ్చి కరోనా టెస్టులు చేయించారు. పరీక్షల అనంతరం కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. జూబ్లీహిల్స్ లోనీ అపోలో లో జాయిన్ అయ్యారు. గోషామహల్ పోలీస్ స్టేడియంలో హరితహారంలో, ఇటీవల పంజాగుట్ట బ్రిడ్జి ప్రారంభోత్సవంలో హోంమంత్రి పాల్గొన్నారు. హొంమంత్రితో పాటు కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ, హైదరాబాద్ సీపీ, పలువురు డీసీపీలు, ఇతర పోలీస్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story