Kadiyam Srihari: తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా నిలుస్తోంది

Kadiyam Srihari: బీఆర్ఎస్ ఇచ్చే 24 గంటల కరెంట్ కావాలా..?

Shekhar G
Published on: 31 Oct 2023 5:45 PM IST
Telangana Stands As Annapurna For The Country Says Kadiyam Srihari
X

Kadiyam Srihari: తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా నిలుస్తోంది

Kadiyam Srihari: హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం గర్మిళ్లపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో డప్పుకొట్టి కార్యకర్తలలో జోష్ నింపారు. కేసీఆర్ ఆశీర్వాదంతో స్టేషన్ ఘన్పూర్ రూపురేఖలు మారుస్తానని.. అమరవీరుల త్యాగఫలం కేసీఆర్ పోరాట ఫలితమే తెలంగాణ ఏర్పడింది అని అన్నారు. వ్యవసాయం దండగ అనే స్థితి నుంచి పండగ అనేలా వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకొచ్చినామనన్నారు.

రైతుబంధు, రైతుభీమా, 24గంటల కరెంట్, కాళేశ్వరం నీళ్లతో రైతులు ఆనందంగా ఉన్నారన్న ఆయన దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ నిలుస్తోందని తెలిపారు. కాంగ్రస్‌ ఇస్తా అనే 3గంటల కరెంట్ కావాల్నా లేక బీఆర్ఎస్ ఇచ్చే 24 గంటల కరెంట్ కావాలో తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మాయమాటలు వింటే ఆగమైతం అని విమర్శించారు.

Shekhar G

Shekhar G

Next Story