Telangana: కరోనా నెగిటివ్ వచ్చింది.. తల్లి ఒడిలో ప్రాణాలు వదిలాడు

Telangana: నిజామాబాద్‌ రెంజల్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కన్నతల్లి ఒడిలోనే కొడుకు కన్నుమూసిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

Arun Chilukuri
Published on: 26 April 2021 12:40 PM IST
Telangana: son Dies in Front of his Mother in Nizamabad
X

Telangana: కరోనా నెగిటివ్ వచ్చింది.. తల్లి ఒడిలో ప్రాణాలు వదిలాడు

Telangana: నిజామాబాద్‌ రెంజల్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కన్నతల్లి ఒడిలోనే కొడుకు కన్నుమూసిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. జ్వరంతో రెంజల్ పీహెచ్‌సీకి అశోక్ అనే వ్యక్తి కరోనా టెస్ట్ కోసం తల్లి సహాయంతో వచ్చాడు. రెండు టెస్టుల్లో కరోనా నెగెటివ్ రావడంతో హాస్పిటల్‌ ఆవరణలోని ఓ చెట్టు కింద తల్లీకొడుకు సేద తీరారు.

ఇక ఆ సమయంలోనే ఉన్నట్టుండి తల్లి ఒడిలో పడిపోయి అశోక్ ప్రాణాలు వదిలాడు. తల్లి కళ్ళముందే కొడుకు ప్రాణాలు విడిచాడు. తల్లి గంగవ్వ రోదించిన తీరు అక్కడున్నవారిని కలిచివేసింది. మృతుడికి భార్య, ఒక కొడుకు ఉన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story