Local Body Elections: ముగ్గురు పిల్లల నిబంధన తొలగింపు.. ఆర్డినెన్స్‌పై సంతకం చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

Local Body Elections: ముగ్గురు పిల్లల నిబంధన తొలగింపు.. ఆర్డినెన్స్‌పై సంతకం చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
x

Local Body Elections: ముగ్గురు పిల్లల నిబంధన తొలగింపు.. ఆర్డినెన్స్‌పై సంతకం చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

Highlights

Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు గుడ్ న్యూస్.

Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు గుడ్ న్యూస్. కొన్నేళ్లుగా ముగ్గురు పిల్లల నిబంధనతో ఇబ్బందులు పడుతున్న వారికి ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. 1995 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవద్దనే నిబంధనను అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. నాడు జనాభాను తగ్గించేందుకు తీసుకొచ్చిన ఈ చట్ట సవరణతో చాలా మందికి తీవ్ర అన్యాయం జరిగింది. ఈ తరహా చట్టం ఉందని తెలియక చాలా మంది రాజకీయాలకు దూరం కావాల్సి వచ్చింది. ఇది గమనించిన రాష్ట్ర ప్రభుత్వం... పంచాయతీ రాజ్ చట్ట సవరణ చేసి గవర్నర్‌కి పంపించింది. చట్ట సవరణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు. గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో ఇవాళ గెజిట్ పబ్లిష్ చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories