BRAOU: రూ. 100 కోట్లతో అంభేడ్కర్ యూనివర్శిటీలో బ్రిడ్జ్ కేంద్రం..పథకాలు, అసమానతలు, విధివిధాలపై అధ్యయనం


రూ. 100 కోట్లతో అంభేడ్కర్ యూనివర్శిటీలో బ్రిడ్జ్ కేంద్రం..పథకాలు, అసమానతలు, విధివిధాలపై అధ్యయనం
BRAOU: డా.బిఆర్ అంబేడ్కర్ విశ్వ విద్యాలయంలో రూ.100 కోట్లతో బ్రిడ్జ్ అనే అంతర్జాతీయ పరిశోధనా కేంద్రాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
BRAOU: డా.బిఆర్ అంబేడ్కర్ విశ్వ విద్యాలయంలో రూ.100 కోట్లతో బ్రిడ్జ్ అనే అంతర్జాతీయ పరిశోధనా కేంద్రాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సామాజిక అసమానతలు, రాజ్యాంగ విధివిధానాలు, ప్రభుత్వ పథకాలు, సామాజిక న్యాయంపై ఇక నుంచి ఈ బ్రిడ్జ్‌లో అధ్యయనం జరగుతుంది. అందరికీ ఒకే న్యాయం జరగాలనే కాన్సెప్ట్‌తో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కులమతాలు, పేద ధనిక ఇవే కాదు ఈ సమాజంలో ఎన్నో అసమానతలు ఉన్నాయి. అయితే వీటన్నింటికీ సరిసమానంగా నిర్వహించాలంటే ఒక వ్యవస్థ కావాలి. అందుకే ప్రభుత్వం ఈ బ్రిడ్జ్ ప్లాన్‌ని తీసుకొచ్చింది. కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాల అమలు తీరుపై అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ పరిశోధనలు జరుపుతారు. అందుకే ఇందుకు డా. బిఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయాన్ని ఎంచుకున్నారు. ఇక్కడ బ్రిబ్జ్ అనే పేరుతో ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసి..అందరికీ సామాజిక న్యాయం చేయనున్నారు.
రూ.100 కోట్లతో బ్రిడ్జ్ కేంద్రం రూపుదిద్దుకుంటోంది. దీనికి అవసరమైన నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది. దీనికోసం ప్రభుత్వం దాదాపు 2 ఎకరాల భూమిని, అలాగే ప్రత్యేకంగా నిధులను సమకూర్చింది. వచ్చే ఆరు నెలల్లో పనులు ప్రారంభమవుతాయి.
బ్రిడ్జ్ అంటే BR Ambedkar International Institute For Dialogue on Governance, Equity. దీని ప్రధాన లక్యం.. సామాజిక అసమానతలు, రాజ్యాంగ విధివిధానాలు, ప్రభుత్వ పథకాలు, సామాజిక న్యాయంపై అధ్యయనం చేయడంతో పాటు గ్రామీణ ప్రాతాల్లోని యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం, రాజ్యాంగంలో పొందుపరిచిన సూత్రాలు, విధి విధానాలు, నైతిక విలువల అనుసరణపై విస్తృతంగా అవగాహన కల్పించడం.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



