కూంబింగ్‌లో గన్ మిస్‌ఫైర్.. కానిస్టేబుల్ మృతి..

X
Highlights
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చేతిలో ఉన్న గన్ మిస్ఫైర్ కావడంతో ఒక...
Arun Chilukuri16 Sep 2020 8:02 AM GMT
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చేతిలో ఉన్న గన్ మిస్ఫైర్ కావడంతో ఒక కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నాపురం అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కానిస్టేబుల్ ఆదిత్య చేతిలోని ఆయుధం ప్రమాదవశాత్తు మిస్ ఫైర్ అయ్యింది. ఈ ఘటనలో అతను ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల కథనం మేరకు.. చెన్నాపురం అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఆర్ఎస్ఐ ఆదిత్య సాయికుమార్ చేతిలోని ఆయుధం మిస్ ఫైర్ కావడంతో మృతి చెందాడని జిల్లా ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ఏరియా దవాఖానకి తరలించారు.
Web TitleTelangana: RSI died after his firearm misfired in Bhadradri district
Next Story