Telangana Rising Global summit: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్.. రూ.5, 75,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న సీఎం రేవంత్

Telangana Rising Global summit: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్.. రూ.5, 75,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న సీఎం రేవంత్
x

Telangana Rising Global summit: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్.. రూ.5, 75,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న సీఎం రేవంత్

Highlights

Telangana Rising Global summit: తెలంగాణ భవిష్యత్తుని నిర్ణయించబోయే గ్లోబల్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. రెండు రోజుల పాటు జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌‌ విజయవంతమయ్యింది.

Telangana Rising Global summit: తెలంగాణ భవిష్యత్తుని నిర్ణయించబోయే గ్లోబల్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. రెండు రోజుల పాటు జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌‌ విజయవంతమయ్యింది. ఆర్థిక సదస్సు మొదలైన తొలి రోజే.. 2 లక్షల 43 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి.. వివిధ కంపెనీలు ప్రభుత్వంతో MOUలు కుదుర్చుకున్నాయి. రెండో రోజు కూడా అదే జోష్ కనిపించింది. 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు MOUలు కుదిరాయి. సుమారుగా 6 లక్షల కోట్ల పెట్టుబుడులు రాష్ట్రానికి వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఒక్క పవర్ సెక్టార్‌లోనే 3 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, ఫుడ్ ప్రాసెసింగ్, డేటా సెంటర్లు, ఫార్మా సెక్టార్, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, టూరిజం రంగాల్లో భారీ ప్రాజెక్టులు వచ్చాయి. దీంతో.. యువతకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. చైనా, జపాన్, జర్మనీ, సౌత్ కొరియా, సింగపూర్‌ని ఆదర్శంగా తీసుకుని.. ఆ దేశాలతో పోటీపడేందుకు తెలంగాణ సిద్ధమైందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. 2047 తెలంగాణ రైజింగ్‌ ప్రయాణంలో భాగంగా.. వివిధ దేశాలకు సంబంధించి పెట్టుబడులు, సహకారం, సమన్వయం కోసం వారిని ఆహ్వానించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రాంతంగా తెలంగాణ తీర్చిదిద్దేదుకు కృషి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ రైజింగ్‌ విజన్‌ డాక్యుమెంట్‌‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ డాక్యుమెంట్‌లో ఉన్న లక్ష్యాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచే అవకాశం ఉందని పలువురు జాతీయ, అంతర్జాతీయ ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ప్రపంచం కూడా తెలంగాణ నమూనాను అనుసరించాల్సి వస్తుందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రజలతో కలిసి రాసిన విజన్‌ డాక్యుమెంట్‌ కలగా మిగలకుండా.. వాస్తవ రూపం దాల్చే అవకాశం ఉందన్నారు. వచ్చే దశాబ్దం నాటికి తెలంగాణ 3 ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. మొత్తం 83 పేజీల డాక్యుమెంట్‌లో మహిళలు, రైతులు, యువత, పిల్లల సంక్షేమం, సామాజిక అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చామన్నారు.

మరో వైపు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025'లో నిర్వహించిన భారీ డ్రోన్ షో రికార్డ్ సృష్టించింది. ఈ సదస్సు ముగింపు వేడుకలో ఏర్పాటు చేసిన డ్రోన్ షో చూపరులందరినీ విశేషంగా ఆకట్టుకుంది. తెలంగాణ రైజింగ్-2047 లక్ష్యాలను వివరిస్తూ ప్రత్యేక థీమ్‌లతో ఈ డ్రోన్ షోను రూపొందించారు. గిన్నిస్ బుక్ రికార్డును నమోదు చేసేలా మొత్తం 3 వేల డ్రోన్‌లతో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. గతంలో అబుదాబిలో 2 వేల 131 డ్రోన్‌లతో నిర్వహించిన ప్రదర్శన గిన్నిస్ బుక్ రికార్డును సాధించింది. ఇప్పుడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సులో డ్రోన్ షో కోత్త రికార్డ్‌ను సృష్టించింది. దీంతో గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రికార్డు సర్టిఫికెట్ ను అందజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories