Telangana Rising Global Summit 2025: తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌–2025

Telangana Rising Global Summit 2025: తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌–2025
x

Telangana Rising Global Summit 2025: తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌–2025

Highlights

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా చేపడుతున్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 కు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్నది. భారత్ ఫ్యూచర్ సిటీలో సదస్సు నిర్వాహణకు ఏర్పాట్ల ముమ్మరం చేసింది.

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా చేపడుతున్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 కు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్నది. భారత్ ఫ్యూచర్ సిటీలో సదస్సు నిర్వాహణకు ఏర్పాట్ల ముమ్మరం చేసింది. సమ్మిట్ నిర్వహణలో ఎక్కడ నిర్వహణ లోపం తలెత్తకుండా ఏర్పాట్లు చేపడుతుంది. 42 దేశాల నుంచి ఒక వెయ్యి 686 ప్రతినిధులు హాజరు కానున్నారు. వీరిలో 255 మంది అంతర్జాతీయ ప్రతినిధులు ఉన్నారు. యూఎస్ఎ, యూకే, సింగపూర్, కెనడా, జర్మనీ తదితర దేశాల నుంచి ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలు సదస్సులో పాల్గొననున్నాయి.

ప్రధాని మోడీతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీలను గ్లబల్ సమ్మిట్ కు హాజరు కావాలంటీ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. ఇతర రాష్ర్టాల సీఎంలను పలువురు మంత్రులు వెళ్లి ఆహ్వానిస్తున్నారు. ప్రారంభోత్సవ వేడుకలకు బ్రిటన్ మాజీ ప్రధాని టోని బ్లెయిర్ తో పాటు బయోకాన్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా, నీతి అయోగ్ వైస్ చైర్మన్ సుమ్న్ కే.బెరి, 2025 మిస్ వరల్డ్ ఒపల్ సుచన చువాంగ్ శ్రీ ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్వైడర్ అతిధులుగా పాల్గొననున్నారు.


గ్లబల్ సమ్మిట్ వేదికంగా 2047 నాటికి తెలంగాణను త్రీ ట్రిలియన్ డాలర్ల ఆర్దిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ప్రత్యేక విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించబోతుంది తెలంగాణ ప్రభుత్వం. ఇదే విధకలో 26 ప్యానల్ డిస్కషనన్స్ జరగనున్నాయి. వీటిలో కాలుష్యరహిత ఇంధనం, గ్రీన్ మొబిలిటీ, గ్లోబల్ హబ్ గా తెలంగాణ, ఏరోస్పేస్, డిఫెన్స్, గిగ్ ఎకానమీ, మూసీ పునరుద్దరణ, ఒలింపిక్స్, సాంస్కృతిక, పర్యాటకం వంటి అశాలు ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు అధికారులు చర్చాగోష్టుల్లో ప్రసంగించనున్నారు. సెమీకండక్టర్ల రంగంలో భాగస్వామ్యాలు, గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల విస్తరణ, ఇండో–పసిఫిక్‌ వాణిజ్య సంబంధాల బలోపేతం, తెలంగాణ నెట్‌–జీరో లక్ష్యాలకు అనుగుణంగా పవర్‌ ప్రాజెక్టుల వేగవంతం వంటి కీలక విధాన ప్రకటనలు, పెట్టుబడుల ఒప్పందాలు సదస్సు వేదికగా జరగనున్నాయి. వంద శాతం అండర్ గ్రౌండ్ ఇంటర్నేట్ నెట్ వర్క్ ను ఏర్పాటు చేసింది. నిరంతరరాయంగా ఎంత ఇంటర్నెట్ కావాలన్నది అందించబోతుంది. ఒకే సారి పదివేల మందికి పైగా వైఫై వినియోగించుకునే విధంగా సదుపాయం కల్పించారు. ఇంటర్నెట్ కమ్యూనికేషన్ కోసం ప్రత్యేకంగా ఎక్కడికక్కడ క్యూఆర్ కోడ్ ఆధారిత లాగిన్ సౌకర్యం సిద్ధం చేశారు.


ప్రాంగణం అంతా ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేస్తున్నారు. సుమారు వంద ఎకరాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన ప్రాంగణం ఎదుట 85 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేసిన భారీ తెర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సమ్మిట్ లో జరిగే కార్యక్రమాలను, తెలంగాణ రైజింగ్ కు సంబంధించిన సమాచారాన్ని నిరంతరాయంగాత ప్రసారం చేయనున్నారు. సమ్మిట్ సందర్భంగా జరిగే వేడుకలను ప్రజలందరూ ఉచితంగా చూసేందుకు తగిన ఏర్పాట్లు చేపడుతున్నారు. నాలుగు రోజుల పాటు మ్యూజికల్ ఆర్కెస్ట్రా నిర్వహించనున్నారు. భవిష్యత్ ప్రాజెక్టుల పై చర్చ గోస్టులు, ప్రభుత్వ నిపుణులతో సంభాషణలు, ప్రభుత్వ శాఖల స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు చూసేందుకు వీలు కల్పిస్తున్నారు.


గ్లోబల్ సమ్మిట్ కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖులు హాజరు అవుతున్న నేపథ్యంలో భద్రత చర్యలు కట్టుదిట్టం చేశారు. మూడంచెల భద్రత కల్పిస్తుంది తెలంగాణ పోలీసు శాఖ. ప్రాంగంలో వెయ్యి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సెంట్రల్ పోలీస్ కంట్రోల్ రూంకు అనుసనందానం చేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో పాటు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన దాదాపు 15 వందల మంది పోలీసులు శాంతిభద్రతలు పర్యవేక్షించనున్నారు. వీరితో పాటు మరో వెయ్యి మంది పోలీసులు ట్రాఫిక్ నియంత్రణలో విధులు నిర్వహించనున్నారు. రోడ్డు మళ్లింపు, బారికేడ్ల ఏర్పాటు, వాహనాల పార్కింగ్ కోసం ట్రాఫిక్ కోసం మార్షల్స్ ను అందుబాటులో ఉంచుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories