తెలంగాణలో రిజిస్ట్రేషన్లు షూరు.. పాత పద్ధతిలోనే..

తెలంగాణలో రిజిస్ట్రేషన్లు షూరు.. పాత పద్ధతిలోనే..
x
Highlights

తెలంగాణలో ఇవాళ్టి నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభయ్యాయి. ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 141 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో...

తెలంగాణలో ఇవాళ్టి నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభయ్యాయి. ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 141 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు పాత పద్దతిలోనే మొదలయ్యాయి. దీంతో, గతంలో మాదిరిగానే అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 54 రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం, అధికారికంగా అనుమతించిన లేఅవుట్లలోని భవనాలు, ప్లాట్లు, ఇతర స్థిరాస్తులను మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. అనధికార లేఅవుట్లలోని స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌కు ప్రస్తుతానికి ఆస్కారం లేదని అధికారులు స్పష్టంచేశారు.

నేటి నుంచి ప్రారంభమైన వ్యవసాయేతర భూముల రిజిస్టేషన్లు కార్డు విధానంలో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అయితే, స్లాట్‌ బుకింగ్‌ అవసరం లేదని, స్టాంప్‌ పేపర్లపై దస్తావేజుల చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. స్థిరాస్తి క్రయ, విక్రయదారులు తమ దస్తావేజులో ఏమైనా పొరపాట్లు ఉన్నా, అనుమానాలున్నా సబ్‌రిజిస్ట్రార్లను నేరుగా సంప్రదించి సరిచేసుకోవచ్చని సూచించారు. రిజిస్ట్రేషన్‌ కోసం ఆధార్, తెలంగాణ ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ లేదా ప్రాపర్టీ ట్యాక్స్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ కూడా అవసరం లేదు. కానీ, ఏదో ఒక గుర్తింపు కార్డు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. ఇక, ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్ విధానంలో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.

వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ కోసం అధికారులు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించారు. కార్డు విధానంలో ఏమైనా సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయా అన్న అంశాలను కూడా పరిశీలించారు. అయితే అందులో ఎలాంటి సమస్యలు ఎదురు కాకపోవడంతో సోమవారం నుంచి పూర్తిస్థాయి సేవలను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories