తెలంగాణలో ప్రతాపం చూపుతోన్న భానుడు

తెలంగాణలో ప్రతాపం చూపుతోన్న భానుడు
x

ఫైల్ ఇమేజ్


Highlights

Telangana: గతంలో ఎన్నడూ లేనంతగా ఫిబ్రవరి చివర, మార్చి మొదటి వారం నుండి పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Telangana: రాష్ట్రంలో భానుడి ప్రతపం మొదలైంది. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా ఫిబ్రవరి చివర, మార్చి మొదటి వారం నుండి పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తూర్పు ఆగ్నేయ దిశ నుంచి వస్తున్న గాలులతో రాష్ట్రం వేడెక్కుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పగలు ఎండ రాత్రి వేడి గాలులతో ప్రజలు అల్లాడుతున్నారు. ఉక్కపోతతో విద్యుత్ డిమాండ్ పెరగడంతో వినియోగం రికార్డ్ స్థాయికి చేరుకుంది.

ఉష్ణోగ్రతలలో భారీ మార్పులు..

గత రెండు మూడు రోజులుగా తెలంగాణలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. ఏప్రిల్, మే నెలల్లో 43-45 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈసారి వడగాలులు కూడా అధికంగా ఉంటాయని అంచనా వేశారు.

వాతావరణంలో పెను మార్పులు...

గత కొంతకాలంగా వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. గతేడాది అప్పటికప్పుడే భారీ వర్షాలు పడడం మళ్ళీ ఎండలు రావడం లాంటివి సంభవించాయి. ఈ సారి గతేడాది కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని సూచనలతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories