టీచర్లందరు రోజూ స్కూళ్లకు రావాల్సిందే

Primary school teachers told to attend schools on daily basis from Today
x

టీచర్లందరు రోజూ స్కూళ్లకు రావాల్సిందే 

Highlights

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల రోజువిడిచి రోజు విధులను ప్రభుత్వం రద్దుచేసింది. ఇవాళ్టి నుంచి ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులంతా స్కూళ్లకు హాజరవ్వాలని...

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల రోజువిడిచి రోజు విధులను ప్రభుత్వం రద్దుచేసింది. ఇవాళ్టి నుంచి ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులంతా స్కూళ్లకు హాజరవ్వాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీచేశారు. గత ఏడాది ఆగస్టు నుంచి టీచర్లు పాఠశాలలకు రోజువిడిచి రోజు చొప్పున హాజరవుతున్నారు.

9, 10 తరగతులు ఫిబ్రవరి 1 నుంచి, 6, 7, 8 తరగతులు గత నెల 24 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రాథమిక తరగతుల ఉపాధ్యాయుల మినహా అందరూ ప్రతిరోజు విధులకు హాజరవుతున్నారు. ఇవాళ్టి నుంచి ప్రాథమిక ఉపాధ్యాయులు కూడా హాజరవుతుండడంతో ప్రత్యక్ష తరగతులు సాగుతున్న పాఠశాలల్లో అవసరాలను బట్టి ఆ టీచర్లను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోనూ వినియోగించుకోవాలని జిల్లాల విద్యాశాఖాధికారులను ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories