తీన్మార్ మల్లన్నపై దాడి.. కేటీఆర్ కుమారుడిపై పోల్.. రాజకీయాలు వేడెక్కాయి...

Teenmar Mallanna - KTR: మల్లన్నపై మండిపడుతున్న టీఆర్‌ఎస్ నాయకులు...

Shireesha
Updated on: 25 Dec 2021 3:32 PM IST
Telangana Politics Heated up with TRS Attack on Teenmar Mallanna and Poll on KTR Son Himanshu | Live News
X

తీన్మార్ మల్లన్నపై దాడి.. కేటీఆర్ కుమారుడిపై పోల్.. రాజకీయాలు వేడెక్కాయి...

Teenmar Mallanna - KTR: తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ఇటీవల బీజేపీలో చేరిన తీర్మాన్ మల్లనకు చెందిన మీడియా సంస్థ ట్విట్టర్‌లో నిర్వహించిన ఓ పోల్ తీవ్ర పరిణామాలకు బీజంగా మారింది. కేటీఆర్ తనయుడు హిమాన్షుపై బాడీ షేమింగ్ కామెంట్‌తో చేసిన ఆ పోల్‌ కారణంగా తీన్మార్ మల్లన్నపై టీఆర్ఎస్ పార్టీలో ఆగ్రహం పెల్లుబికింది. ట్విట్టర్ వేదికగానే కేటీఆర్.. మల్లన్న, బీజేపీపై మండిపడ్డారు.

ఈ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమారుడిపై అభ్యంతర వ్యాఖ్యలు చేయడం పట్ల ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. సోషల్ మీడియా.. సంఘ విద్రోహక శక్తులకు అడ్డాగా మారిందని అన్నారు. బీజేపీ మీడియా థర్డ్ గ్రేడ్ నాయకులు తన పిల్లలపై నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

బీజేపీ నేతలకు జేపీ నడ్డా నేర్పిన సంస్కారం ఇదేనా అని ప్రశ్నించారు. రాజకీయాల్లోకి తన కొడుకును లాగడం సరైనదేనా అని నిలదీశారు. ఇలాగే మోడీ, అమిత్‌షా టుంబాలను విమర్శిస్తే ఊరుకుంటారా అని ప్రశ్నించారు.

Shireesha

Shireesha

Next Story