కాల్ మనీ యాప్‌లను నిషేధించాలి : కేంద్ర హోం శాఖకు తెలంగాణ పోలీస్ శాఖ లేఖ

X
Highlights
కాల్ మనీ యాప్‌లను నిషేధించాలని కేంద్ర హోంశాఖ, ఐటీ శాఖలకు తెలంగాణ పోలీస్ శాఖ లేఖ రాసింది. మరోవైపు ఆన్‌లైన్...
Arun Chilukuri20 Dec 2020 6:46 AM GMT
కాల్ మనీ యాప్‌లను నిషేధించాలని కేంద్ర హోంశాఖ, ఐటీ శాఖలకు తెలంగాణ పోలీస్ శాఖ లేఖ రాసింది. మరోవైపు ఆన్‌లైన్ కాల్ మనీ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. మైక్రో ఫైనాన్స్ యాప్‌లను రూపొందించిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నాలుగు నెలల నుంచి యువకుడు యాప్‌ల ద్వారా రుణాలు ఇస్తున్నాడని తీసుకున్న డబ్బుకు 50 శాతానికిపైగా వడ్డీ చెల్లించినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. కాల్ మనీ యాప్‌లను కట్టడి చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. కాల్ మనీ యాప్‌లు నిషేధించాలని కేంద్ర హోంశాఖ, ఐటీ శాఖలకు తెలంగాణ పోలీస్ శాఖ లేఖ రాసింది.
Web TitleTelangana police write a letter to the central home ministry to ban loan apps
Next Story