YS Sharmila: రంగారెడ్డి జిల్లాలో వైఎస్‌ షర్మిల పర్యటనకు అడ్డంకులు

పరిగి వెళ్తుండగా చిత్తంపల్లి వద్డ షర్మిల కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు

Samba Siva Rao
Published on: 11 Jun 2021 12:26 PM IST
Telangana Police Stopped YS Sharmila Convoy
X

వైఎస్ షర్మిల ఫైల్ ఫోటో

YS Sharmila: రంగారెడ్డి జిల్లాలో వైఎస్‌ షర్మిల పర్యటనకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు. భారీ వర్షాలతో తడిసిన ధాన్యాన్ని పరిశీలించేందుకు షర్మిల పరిగికి వెళ్తుండగా.. చిత్తంపల్లి వద్డ కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. పాలెపల్లి ఐకేపీ సెంటర్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. కోవిడ్‌ దృష్ట్యా సభలు, సమావేశాలకు అనుమతి లేదని చెప్పారు పోలీసులు. దీంతో కాన్వాయ్‌లోని ఇతర వాహనాలను చింతపల్లి దగ్గర పోలీసులు నిలిపివేశారు. ఈ సందర్భంగా కాసేపు పోలీసులకు, వైఎస్సార్‌టీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాగా.. మరికాసేపట్లో దోమ మండలం పాలెపల్లికి షర్మిల చేరుకోనున్నారు. ప్రతిపక్షాల అసత్య ప్రచారం తిప్పికొడతామంటూ.. దోమ మండలం టీఆర్ఎస్ శ్రేణులు ప్రకటన చేశాయి.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story