Telangana: బీజేపీ జాతీయ నేత నడ్డాకు తప్పని ఆంక్షలు

Telangana: జేపీ నడ్డా నిరసన ర్యాలీకి అనుమతి నిరాకరణ

Rama Rao
Published on: 4 Jan 2022 1:15 PM IST
Telangana Police Rejects Permission for JP Nadda Rally in Hyderabad | TS News Today
X

జేపీ నడ్డా నిరసన ర్యాలీకి అనుమతి నిరాకరణ

Telangana: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ర్యాలీకి హైదరాబాద్‌ పోలీసులు అనుమతి నిరాకరించారు. కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో అనుమతి నిరాకరించినట్లు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌ నేపథ్యంలో 14 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ బీజేపీ నేతలు నిర్ణయించారు. దీనిలో భాగంగా ఈరోజు సాయంత్రం సికింద్రాబాద్‌లో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టనున్నారు.

ఈ ర్యాలీలో పాల్గొనేందుకు జేపీ నడ్డా నగరానికి రానున్నారు. రాష్ట్రంలో కొవిడ్‌ నిబంధనలతో ఎలాంటి ర్యాలీలు, బహిరంగసభలకు అనుమతి లేదని అందుకే కొవ్వొత్తుల ర్యాలీకి అనుమతి నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు బీజేపీ నేతలు మాత్రం ర్యాలీ నిర్వహించి తీరుతామని చెబుతున్నారు.

Rama Rao

Rama Rao

Next Story