ఆన్‌లైన్‌లో ఈ పాసుల జారీ : రాచకొండ సీపీ

ఆన్‌లైన్‌లో ఈ పాసుల జారీ : రాచకొండ సీపీ
x
Essential Services Digital Pass
Highlights

రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతుండడంతో చాలా మంది సామాన్యులు కష్టాలను ఎదుర్కొంటున్నారు.

రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతుండడంతో చాలా మంది సామాన్యులు కష్టాలను ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా బయటికి వెళ్లినపుడు పోలీసులు వారిని అడ్డగిస్తున్నారు. సామాన్యులుఎదుర్కొంటున్న ఈ సమస్యలను తీర్చడానికే రాచకొండ పోలీసులు ఆన్‌లైన్‌ ఈ - పాస్‌ మేనేజ్‌మెంట్‌ను సర్వీస్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ పాస్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ను రాచకొండ పోలీసులు రెండు రోజుల నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ టీఎస్‌ పాసు మేనేజ్‌మెంట్‌ను రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌, అదనపు డీసీపీ అడ్మిన్‌ శిలవల్లి, ఐటీ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌రెడ్డితో పాటు బెంగళూరుకు చెందిన ఎన్‌వీపానీ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ప్రతినిధులు రూపొందించామని అధికారులు తెలిపారు. పాస్ కావల్సిన వారు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో ఈ పాస్‌ను క్యూఆర్‌ కోడ్‌తో ఈ మెయిల్‌కు పంపిస్తారని స్పష్టం చేసారు. https://covid-tspolice.nvipani.com/ అనే వెబ్ సైట్ ద్వారా పాసుల కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ పాస్‌ రాచకొండ, సైబరాబాద్‌, రాచకొండ, సంగారెడ్డి ప్రాంతాల్లో చెల్లుతుందని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories