Telangana: ఈనెల 30 నుంచి పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్.. టూవీలర్స్‌పై 80 శాతం రాయితీ

Telangana: తెలంగాణలో మరోసారి వాహనదారులకు ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌ తీపికబురు ఇచ్చింది.

Arun Chilukuri
Updated on: 22 Dec 2023 4:38 PM IST
Telangana Police Department Announced Discounts on Challans
X

Telangana: ఈనెల 30 నుంచి పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్.. టూవీలర్స్‌పై 80 శాతం రాయితీ

Telangana: తెలంగాణలో మరోసారి వాహనదారులకు ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌ తీపికబురు ఇచ్చింది. వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై రాయితీ ప్రకటించింది. ఈనెల 30నుంచి పెండింగ్ చలాన్ల పేమెంట్లకు డిస్కౌంట్‌ ప్రకటించారు పోలీసులు. ఆర్టీసీ బస్సులు, తోపుడు బళ్లపై ఉన్న చలాన్లలో 90 శాతం రాయితీ కల్పించగా.. టూవీలర్స్‌పై 80 శాతం.. ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం.. వెహికిల్స్‌పై 50 శాతం రాయితీ కల్పించారు. ప్రస్తుతం తెలంగాణలో 2 కోట్లకు పైగా పెండింగ్ చలాన్లు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మీ వాహనంపై ఎన్ని చలానాలు ఉన్నాయో ఇక్కడ క్లిక్‌ చేసి చెక్‌ చేసుకోండి. https://echallan.tspolice.gov.in/publicview/

Arun Chilukuri

Arun Chilukuri

Next Story