TPCC Meeting: తెలంగాణ పీసీసీ కార్యవర్గం వర్చువల్‌ భేటీ

TPCC Meeting: ఏప్రిల్‌ లాస్ట్‌ వీక్‌లో వరంగల్‌లో రైతు బహిరంగ సభ

Rama Rao
Updated on: 28 March 2022 8:30 PM IST
Telangana PCC Working Committee Virtual Meeting | TS News Today
X

తెలంగాణ పీసీసీ కార్యవర్గం వర్చువల్‌ భేటీ

TPCC Meeting: తెలంగాణ పీసీసీ కార్యవర్గం వర్చువల్‌ భేటీ అయ్యింది. ఈ భేటీలో టీపీసీసీ కార్యవర్గం ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని నిర్ణయించాయి. మార్చి వరకు ధాన్యం కొనుగోళ్లపై ఆందోళనలు కొనసాగించాలని కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. ఇటు కాంగ్రెస్‌ సీనియర్లు జిల్లాల్లో పర్యటించాలని పీసీసీ ఆదేశించింది. అలాగే ఏప్రిల్‌ లాస్ట్‌ వీక్‌లో వరంగల్‌లో రైతు బహిరంగ సభ ఏర్పాటు చేయాలని డిసైడ్‌ అయ్యారు.

ఈ సభకు రాహుల్‌ గాంధీ కూడా రానున్నారు. ఏప్రిల్‌ 2 నుంచి 4 వరకు పెరిగిన ధరలపై ఆందోళనలు చేయాలని పీసీసీ కమిటీ ప్రణాళికలు సిద్ధం చేసింది. అలాగే ఏప్రిల్‌ 7న సివిల్ సప్లై, విద్యుత్‌ సౌధ వద్ద భారీ ధర్నాలు చేపట్టాలని నిర్ణయించింది. ఉద్యమ కార్యాచరణకు కమిటీలు కూడా వేయాలని కాంగ్రెస్‌ పార్టీ వర్చువల్‌ భేటీలో నిర్ణయించింది.

Rama Rao

Rama Rao

Next Story