పంచాయతీ ఎన్నికల్లో హవా కొనసాగించిన కాంగ్రెస్

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొయినాబాద్, శంకర్‌పల్లి మండలాల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు హవా కొనసాగించారు.

Arun Chilukuri
Published on: 15 Dec 2025 11:55 AM IST
పంచాయతీ ఎన్నికల్లో హవా కొనసాగించిన కాంగ్రెస్
X

పంచాయతీ ఎన్నికల్లో హవా కొనసాగించిన కాంగ్రెస్

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొయినాబాద్, శంకర్‌పల్లి మండలాల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు హవా కొనసాగించారు. కొన్ని గ్రామాల్లో రీకౌంటింగ్ కారణంగా ఫలితాలు ఆలస్యంగా వెలువడ్డాయి. మొయినాబాద్ మండలం బాకారం జాగీర్ గ్రామంలో బీజేపీ బలపర్చిన అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ 4 ఓట్ల స్వల్ప తేడాతో గెలుపొందారు.

మొయినాబాద్ మండలంలో 19 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగ్గా.. 9 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీజేపీ 5, బీఆర్ఎస్ 4, స్వతంత్ర అభ్యర్థి ఒక చోట గెలుపొందారు. ఇక శంకర్‌పల్లి మండలంలో 24 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 11 స్థానాల్లో గెలుపొందగా, బీఆర్‌ఎస్ 7, స్వతంత్రులు 5, బీజేపీ ఒక చోట విజయం సాధించాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story