Telangana Panchayat Elections: తెలంగాణలో రిజర్వేషన్ల ఖరారుపై మరో పిటిషన్

Telangana Panchayat Elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సైరన్ మోగగా.. రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది.

Arun Chilukuri
Published on: 27 Nov 2025 11:52 AM IST
Telangana Panchayat Elections: తెలంగాణలో రిజర్వేషన్ల ఖరారుపై మరో పిటిషన్
X

Telangana Panchayat Elections: తెలంగాణలో రిజర్వేషన్ల ఖరారుపై మరో పిటిషన్

Telangana Panchayat Elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సైరన్ మోగగా.. రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని కోరుతూ వికారాబాద్‌కు చెందిన మచ్చదేవ్ అనే వ్యక్తి పిల్ దాఖలు చేశాడు. ఎంపిరికల్ డేటా బహిర్గతం చేయకుండానే రిజర్వేషన్లు ఖరారు చేశారని పిటిషన్ వేశారు. డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేధిక ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చారు కానీ.. రిపోర్ట్‌ను పబ్లిక్ డొమైన్‌లో పెట్టలేదన్నారు పిటిషనర్. రేపు హైకోర్టులో పిల్‌పై విచారణ జరిగే అవకాశం ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story