Telangana Panchayat Elections 2025: తెలంగాణలో తొలి దశ సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధం

Telangana Panchayat Elections 2025: తెలంగాణలో తొలి దశ సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధం
x
Highlights

Telangana Panchayat Elections 2025: తెలంగాణలో తొలి దశ సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధం అయ్యింది.

Telangana Panchayat Elections 2025: తెలంగాణలో తొలి దశ సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధం అయ్యింది. 3వేల 836 పంచాయతీలు, 27వేల 960 వార్డులకు రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతోంది. సాయంత్రం 5 గంటల వరకల్లా ఫలితాలు వెల్లడించనున్నారు. మొత్తంగా ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ బరిలో 81వేల 20 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. అయితే సర్పంచ్ పదవులకు 13వేల 27 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వార్డు మెంబర్ పదవులకు 67,893 మంది అభ్యర్థులు బరిలో దిగబోతున్నారు. అయితే ఇప్పటికే 395 గ్రామంపంచాయతీలు, 9వేల 331 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. డిస్ట్రిబ్యూషన్ కౌంటర్ల దగ్గర పోలీస్ సిబ్బందికి సామాగ్రి అందజేశారు. ఇప్పటికే పోలింగ్ సెంటర్లకు ఎన్నికల సిబ్బంది చేరుకుంటోంది.

సర్పంచ్ ఎన్నికల వేళ గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా కష్టపడుతున్నారు. గెలవాలనే లక్ష్యంతో ఖర్చుకు వెనుకాడకుండా..ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. గెలవాలనే లక్ష్యంతో ఖర్చుకు వెనకడుగు వేయడం లేదు. ప్రత్యర్థి వ్యూహాలకు దీటుగా ప్రతి వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందుకోసం ప్రతి ఇంటికి పోలింగ్ ముందు రోజు బహుమతులు పంపుతున్నారు. కొందరు చికెన్, మటన్ పంపుతుంటే, మరికొందరు లిక్కర్‌ను సరఫరా చేస్తున్నారు. ఇంకొన్ని గ్రామాల్లో ఓటుకు వెయ్యి నుంచి రెండు వేల వరకు పంచబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

తెలంగాణలోని 4వేల 236 గ్రామాల్లో రేపు సర్పంచ్, వార్డు మెంబర్ల కోసం ఎన్నికలు జరుగనున్నాయి. ఆయా గ్రామాల్లో ఇప్పటికే ఈసీ పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే పోలింగ్‌కు ముందు గ్రామాల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు ప్లాన్ చేస్తున్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి కిలో చికెన్ పంపిణీ చేసేలా ఏర్పాట్లు సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకోసం స్థానిక వ్యాపారులకు ఆర్డర్లు ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. అభ్యర్థుల మనుషులు ఉదయాన్నే ఇంటింటికి తిరిగి చికెన్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఏదీ ఏమైనా ఎలక్షన్ వేళ గ్రామాల్లో హడావుడి మాములుగా లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories