Telangana: కొత్త వేరియంట్‌పై తెలంగాణ సర్కార్‌ అలర్ట్‌!

Telangana: దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాల్లో కలకలం సృష్టిస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అయింది.

Arun Chilukuri
Published on: 27 Nov 2021 4:57 PM IST
Telangana on High Alert Over New Corona Variant
X

Telangana: కొత్త వేరియంట్‌పై తెలంగాణ సర్కార్‌ అలర్ట్‌!

Telangana: దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాల్లో కలకలం సృష్టిస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అయింది. ఈ నేప‌థ్యంలో ఈ నెల 28న వైద్యారోగ్య శాఖ అధికారుల‌తో మంత్రి హ‌రీశ్‌రావు స‌మావేశం కానున్నారు. క‌రోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల విష‌యంలో తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించ‌నున్నారు. కొత్త వేరియంట్‌ వ్యాపిస్తున్న దేశాల నుంచి వచ్చే వారి విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించనున్నారు. ఇదే అంశంపై ఇటీవల కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల ట్రేసింగ్, టెస్టింగ్‌పై మంత్రి హ‌రీశ్‌రావు వైద్యారోగ్య శాఖ అధికారుల‌తో చ‌ర్చించి, ప‌లు సూచ‌న‌లు చేయ‌నున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story