Today Top 6 News: తెలంగాణ రౌండప్: విద్యార్థులకు కేసీఆర్ ఆర్థిక సాయం.. మైదానంలో బ్యాట్ పట్టిన పోచారం.. రాష్ట్రంలోని మరిన్ని ముఖ్యాంశాలు!

Today Top 6 News:  తెలంగాణ రౌండప్: విద్యార్థులకు కేసీఆర్ ఆర్థిక సాయం.. మైదానంలో బ్యాట్ పట్టిన పోచారం.. రాష్ట్రంలోని మరిన్ని ముఖ్యాంశాలు!
x

Today Top 6 News: తెలంగాణ రౌండప్: విద్యార్థులకు కేసీఆర్ ఆర్థిక సాయం.. మైదానంలో బ్యాట్ పట్టిన పోచారం.. రాష్ట్రంలోని మరిన్ని ముఖ్యాంశాలు!

Highlights

1.చెక్కుల పంపిణిమాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత MBBS విద్యార్థుల వైద్య విద్యకు ఖర్చయ్యే ఫీజుకు సంబంధించి చెక్కులను పంపిణీ చేశారు. ఉప్పల్ ఎమ్మెల్యే...

1.చెక్కుల పంపిణి

మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత MBBS విద్యార్థుల వైద్య విద్యకు ఖర్చయ్యే ఫీజుకు సంబంధించి చెక్కులను పంపిణీ చేశారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్ పరిసర ప్రాంతాలకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్ధులను నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి తీసుకు వెళ్లారు. 15 మంది విద్యార్ధులకు కేసీఆర్ చేతుల మీదుగా చెక్కులు అందచేయించారు.

2.ఉచిత వైద్యం

శేరిలింగంపల్లి నియోజకవపర్గం వివేకానంద నగర్ డివిజన్ మాధవరం కాలనీలో ఆర్‌.ఎన్.సి హాస్పిటల్ నిర్వహాకులు తేళ్ల హరికృష్ణ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రోజువారి జీవితంలో ప్రజలు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని సీనియర్ నేత హరికృష్ణ అన్నారు. శిబిరంలో వైద్యపరీక్షలు చేయించుకున్నావారికి ఉచిత మందులు అందచేశారు. ఎమ్మెల్యే వివేకానంద ఉచిత వైద్యశిబిరానికి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.

3.గాంధీపేరు ఉంచాలి

వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో వరంగల్ జిల్లాలోని అట్టడుకు వర్గాల ప్రజలకు మెరుగైన పాలన అందుతుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించాలనుకోవడం సరికాదన్నారు. ఇందుకు నిరసనగా వరంగల్ లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళలకు ఆర్ధిక స్వావలంభన కల్పించిన పథకంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. ఉపాధి హామీ పథకానికి తగిన బడ్జెట్ కేటాయింపులు చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు.

4.కారు దగ్ధం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కారులో మంటలు ఎగిసిపడ్డాయి. టేకులపల్లిలో ఘటన చోటు చేసుకుంది. పాల్వంచకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు డోర్నకల్‌‌లో అయ్యప్ప స్వామి ఇరుముడి కార్యక్రమానికి వెళ్తుండగా కారు ఏసీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే కారు పూర్తిగా దగ్ధం అయింది,. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు.

5.ఆత్మ గౌరవం

వరంగల్ జిల్లాలో ప్రజల ఆత్మ గౌరవం కోసమే నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్తున్నానని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య చెప్పారు. ఆత్మ గౌరవం కోసం కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఇబ్బందులు పడుతున్నారని వారిని కాపాడుకునే బాధ్యత తనపై ఉందని అన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడు ముందుంటానని ఎమ్మెల్సీ సారయ్య చెప్పారు.

6.జిల్లా స్థాయి క్రికెట్

నిజామబాద్ జిల్లా మోస్రా మండలం చింతకుంటలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడారు. బ్యాట్ పట్టి కుర్రాడిగా బంతిని కొట్టి అలరించారు. యువతకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. టోర్నమెంట్ లో విజేతలను పోచారం శ్రీనివాసరెడ్డి అభినందించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories