Telangana: తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు..

Telangana: జీవో జారీ చేసినప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్

Jyothi
Updated on: 16 Sept 2022 9:31 AM IST
Telangana new Secretariat Named after Ambedkar
X

Telangana: తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు..

Telangana:తెలంగాణ నూత‌న స‌చివాల‌యానికి భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాల‌ని TRS స‌ర్కారు నిర్ణయించింది. ఈ మేర‌కు సీఎం కేసీఆర్ కీల‌క ఆదేశాల మేరకు అధికారులు దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీలో నూత‌నంగా నిర్మించిన పార్లమెంటు భ‌వ‌నానికి అంబేద్కర్ పేరు పెట్టాలంటూ టీఆర్ఎస్ సర్కారు ఇటీవ‌లే అసెంబ్లీ స‌మావేశాల్లో తీర్మానాన్ని పెట్టి ఆమోదించి కేంద్రానికి పంపింది. అయితే కేంద్రం నుంచి ఎలాంటి స్పంద‌న రాక‌పోవ‌డంతో తెలంగాణ నూత‌న స‌చివాల‌యానికి అంబేద్కర్ పేరు పెడుతూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Jyothi

Jyothi

Next Story