Telangana Municipal Elections: ఇవాళ 11 మున్సిపాలిటీల్లో చైర్మన్లు, వైస్‌చైర్మన్ల ఎన్నిక

Telangana Municipal Elections: తెలంగాణలో ఇవాళ 11 మున్సిపాలిటీల్లో చైర్మన్లు, వైస్‌చైర్మన్ల ఎన్నిక జరగబోతోంది.

Arun Chilukuri
Published on: 17 Feb 2026 10:50 AM IST
Telangana Municipal Elections: ఇవాళ 11 మున్సిపాలిటీల్లో చైర్మన్లు, వైస్‌చైర్మన్ల ఎన్నిక
X

Telangana Municipal Elections: తెలంగాణలో ఇవాళ 11 మున్సిపాలిటీల్లో చైర్మన్లు, వైస్‌చైర్మన్ల ఎన్నిక జరగబోతోంది. నిన్నటి వివాదాలతో ఇవాళ మరింత పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నం, జనగామ, క్యాతనపల్లి, డోర్నకల్‌..కాగజ్‌నగర్‌, ఖానాపూర్‌, ఇంద్రేశం, జహీరాబాద్‌.. తొర్రూర్‌, ఇల్లందు, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీల్లో ఎన్నిక ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. మహబూబాబాద్‌ జిల్లా తోర్రూర్‌లో 11 వార్డుల్లో 9 వార్డులు బీఆర్‌ఎస్‌.. 7 వార్డుల్లో కాంగ్రెస్‌ గెలిచింది. అధికార పార్టీకి చెందిన ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యేశాస్వీనిరెడ్డి క్స్‌ అఫీషియా ఓట్లు నమోదు చేసుకోవడంతో.. ఆ పార్టీ బలం 9కి చేరింది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు సమాన ఓట్లు ఉండడంతో లాటరీ పద్దతీలో ఎన్నుకునే ఛాన్స్‌ ఉంది. ఈ క్రమంలో నిన్న ఘర్షనలు తలేత్తడంతో ఇవాళ్టికి వాయిదా పడింది. ఛైర్మన్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story