Telangana Municipal Elections: మున్సిపల్ పోరులో బ్రేక్: తెలంగాణలో 11 మున్సిపాలిటీల ఎన్నిక వాయిదా.. ఆ జాబితాలో మీ ఊరు ఉందేమో చూడండి!

Telangana Municipal Elections: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ పీఠాల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగా, పలు చోట్ల అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.

Arun Chilukuri
Published on: 16 Feb 2026 3:19 PM IST
Telangana Municipal Elections: మున్సిపల్ పోరులో బ్రేక్: తెలంగాణలో 11 మున్సిపాలిటీల ఎన్నిక వాయిదా.. ఆ జాబితాలో మీ ఊరు ఉందేమో చూడండి!
X

Telangana Municipal Elections: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ పీఠాల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగా, పలు చోట్ల అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. వివిధ కారణాల వల్ల రాష్ట్రంలోని 11 మున్సిపాలిటీల్లో ఛైర్‌పర్సన్లు మరియు వైస్‌ ఛైర్‌పర్సన్ల ఎన్నిక ప్రక్రియ వాయిదా పడినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

ఎన్నిక వాయిదా పడిన మున్సిపాలిటీల జాబితా:

కింద పేర్కొన్న మున్సిపాలిటీల్లో నేడు జరగాల్సిన ఎన్నిక నిలిచిపోయింది:

ఇల్లందు

సుల్తానాబాద్‌

ఇబ్రహీంపట్నం

కాగజ్‌నగర్‌

క్యాతనపల్లి

ఖానాపూర్‌

జహీరాబాద్‌

ఇంద్రేశం

డోర్నకల్‌

జనగామ

తొర్రూరు

కొన్ని చోట్ల కోరం లేకపోవడం, మరికొన్ని చోట్ల అధికార-ప్రతిపక్ష వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొనడం, రాజకీయ సమీకరణాలు కుదరకపోవడంతో అధికారులు ఎన్నికను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా క్యాంపు రాజకీయాలు, కౌన్సిలర్ల జంపింగ్‌ల నేపథ్యంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.

తదుపరి ప్రక్రియ ఎప్పుడు?

వాయిదా పడిన ఈ మున్సిపాలిటీల్లో తిరిగి ఎన్నికల ప్రక్రియను ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుండి ఇంకా అధికారిక స్పష్టత రాలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చే వరకు కౌన్సిలర్లు తమ క్యాంపుల్లోనే కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story