Telangana Municipal Polls 2026: తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం.. ఎల్లుండే పోలింగ్!

Telangana Municipal Polls 2026: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి క్లైమాక్స్‌కు చేరింది.

Arun Chilukuri
Published on: 9 Feb 2026 5:27 PM IST
Telangana Municipal Polls 2026: తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం.. ఎల్లుండే పోలింగ్!
X

Telangana Municipal Polls 2026: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి క్లైమాక్స్‌కు చేరింది. గత కొన్ని రోజులుగా అభ్యర్థుల జోరు, పార్టీల హోరుతో దద్దరిల్లిన పురవీధులు నేటితో ప్రశాంతంగా మారాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచార గడువు నేటితో ముగియడంతో మైకులు మూగబోయాయి. ఇక అభ్యర్థులు ఇంటింటి ప్రచారం (Door-to-door campaign)పై దృష్టి సారించారు.

ఎన్నికల వివరాలు ఒకేచోట:

రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న ఈ పోరులో కీలక గణాంకాలు ఇలా ఉన్నాయి:

పోలింగ్ తేదీ: ఈనెల 11వ తేదీ (బుధవారం).

ఎన్నికలు జరిగే స్థానాలు: 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు.

అభ్యర్థుల సంఖ్య: మొత్తం 12,930 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

పోలింగ్ కేంద్రాలు: ఓటర్ల సౌకర్యార్థం రాష్ట్ర ఎన్నికల సంఘం 8,203 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

కౌంటింగ్: ఈనెల 13న ఓట్ల లెక్కింపు చేపట్టి, అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు.

అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్!

ప్రచార గడువు ముగియడంతో ఇక తెర వెనుక రాజకీయాలు మొదలయ్యాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. సమస్యాత్మక కేంద్రాల్లో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

మరో రెండు రోజుల్లో పట్టణ ఓటరు ఎవరికి పట్టం కడతారో తేలిపోనుంది. 13న వెలువడే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకం కానున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story