మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే

మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే
x
Highlights

తెలంగాణలో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల నగారా మోగింది. మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయింది. ఈ మేరకు ఎన్నికల...

తెలంగాణలో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల నగారా మోగింది. మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జనవరి 7న పురపాలక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈనెల 30న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. డిసెంబర్‌ 31 నుంచి జనవరి 2 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. డిసెంబర్‌ 31వ తేదీన జిల్లా అధికారులతో రాజకీయ పార్టీల సమావేశం నిర్వహిస్తారు. జనవరి 1న మున్సిపల్‌ కమిషనర్లతో ఈసీ భేటీ అవుతుంది. జనవరి 3న అభ్యంతరాలకు పరిష్కారం, వివరణ ఇస్తారు. జనవరి 4న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తారు.

జనవరి 10న నామినేషన్లకు చివరి తేదీ

జనవరి 11న నామినేషన్ల పరిశీలన

జనవరి 14న ఉపసంహరణకు తుది గడువు

జనవరి 22న పోలింగ్‌

జనవరి 25న ఓట్ల లెక్కింపు

Show Full Article
Print Article
Next Story
More Stories