Municipal Election Results 2026: మున్సిపల్ ఫలితాల వేళ బీఆర్‌ఎస్ అలెర్ట్.. క్యాంపు రాజకీయాలకు తెరలేపిన గులాబీ పార్టీ!

Municipal Election Results 2026: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

Arun Chilukuri
Published on: 12 Feb 2026 4:01 PM IST
Municipal Election Results 2026: మున్సిపల్ ఫలితాల వేళ బీఆర్‌ఎస్ అలెర్ట్.. క్యాంపు రాజకీయాలకు తెరలేపిన గులాబీ పార్టీ!
X

Municipal Election Results 2026: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఫలితాల అనంతరం తన అభ్యర్థులు ఇతర పార్టీల వైపు వెళ్లకుండా చూసేందుకు భారత్ రాష్ట్ర సమితి (BRS) 'క్యాంపు రాజకీయాలకు' తెరలేపింది. గెలిచే అవకాశమున్న అభ్యర్థులను ఇప్పటికే హైదరాబాద్ శివారులోని ఫాంహౌస్‌లు, రిసార్టులకు తరలిస్తోంది.

మరోవైపు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ముఖ్య నేతలు, సమన్వయకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

కేటీఆర్ జారీ చేసిన కీలక ఆదేశాలు:

గెలిచిన అభ్యర్థులు చేజారిపోకుండా చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత ఆయా నియోజకవర్గ సమన్వయకర్తలదేనని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు వెంటనే విప్ జారీ చేయాలని, తద్వారా పార్టీ ఫిరాయింపులకు అవకాశం లేకుండా చూడాలని ఆదేశించారు. ఏయే మున్సిపాలిటీల్లో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు అవసరం అవుతుందో ముందే గుర్తించాలని కోరారు. అవసరమైన చోట తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల ఓట్లను నమోదు చేయించుకునేలా ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

మున్సిపల్ చైర్మన్ పదవులను దక్కించుకోవడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ప్రతిపక్షాల ఎత్తుగడలను చిత్తు చేస్తూ, మేజిక్ ఫిగర్ సాధించే మున్సిపాలిటీల్లో పట్టు కోల్పోకుండా జాగ్రత్త పడుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story