TG Muncipal Elections Results 2026: తెలంగాణ మున్సిపల్ పోరులో ‘హంగ్’ సెగ: 15 పట్టణాల్లో తేలని ఫలితం.. కింగ్ మేకర్లుగా ఎక్స్-అఫీషియో ఓటర్లు!

TG Muncipal Elections Results 2026: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తుది దశకు చేరుకున్న వేళ రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి.

Arun Chilukuri
Published on: 13 Feb 2026 2:47 PM IST
TG Muncipal Elections Results 2026: తెలంగాణ మున్సిపల్ పోరులో ‘హంగ్’ సెగ: 15 పట్టణాల్లో తేలని ఫలితం.. కింగ్ మేకర్లుగా ఎక్స్-అఫీషియో ఓటర్లు!
X

TG Muncipal Elections Results 2026: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తుది దశకు చేరుకున్న వేళ రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. మెజారిటీ మున్సిపాలిటీల్లో ఫలితాలు స్పష్టంగా వచ్చినప్పటికీ, దాదాపు 15 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ (Magic Figure) దక్కలేదు. దీంతో ఆయా పట్టణాల్లో 'హంగ్' ఏర్పడి, చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలు ఇవే:

రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఓట్లు చీలిపోవడంతో కింద పేర్కొన్న ప్రాంతాల్లో స్పష్టమైన ఆధిక్యం లభించలేదు:

ఉమ్మడి మహబూబ్‌నగర్: దేవరకద్ర, అలంపూర్‌, అమరచింత, గద్వాల.

ఉమ్మడి మెదక్/సంగారెడ్డి: కోహీర్‌, జిన్నారం, జహీరాబాద్‌, ఆలియాబాద్‌.

ఉమ్మడి వరంగల్/కరీంనగర్: కేసముద్రం, జనగామ, జమ్మికుంట, వేములవాడ, రాయికల్‌.

ఇతర ప్రాంతాలు: ఆసిఫాబాద్‌, క్యాతనపల్లి.

పీఠం ఎవరిదో తేల్చేది వారే:

ఈ హంగ్ మున్సిపాలిటీల్లో ఇప్పుడు ఎవరికి చైర్మన్ పీఠం దక్కుతుందనేది ఎక్స్-అఫీషియో ఓట్ల (ఎంపీలు, ఎమ్మెల్యేలు) మీద ఆధారపడి ఉంది. స్వతంత్ర అభ్యర్థులు గెలిచిన చోట్ల వారి మద్దతు కూడగట్టేందుకు ప్రధాన పార్టీలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. క్యాంపు రాజకీయాలకు కూడా తెరలేచే అవకాశం కనిపిస్తోంది. పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్ తన అధికార బలాన్ని వాడుతుండగా, తమ పట్టున్న ప్రాంతాల్లో బీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story