Telangana Municipal Election Results 2026: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో ట్విస్ట్..!

Telangana Municipal Election Results 2026: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో ఎవరూ ఊహించని ట్విస్ట్‌ ఎదురైంది.

Arun Chilukuri
Published on: 14 Feb 2026 10:47 AM IST
Telangana Municipal Election Results 2026: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో ట్విస్ట్..!
X

Telangana Municipal Election Results 2026: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో ఎవరూ ఊహించని ట్విస్ట్‌ ఎదురైంది. మూడు కార్పొరేషన్లు.. 30కి పైగా మున్సిపాలిటీల్లో హంగ్‌ వచ్చింది. దీంతో హంగ్‌లో కింగ్‌ ఎవరనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నిజామాబాద్‌, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌లలో ఏ పార్టీ మ్యాజిక్‌ ఫిగర్ 31ని రీచ్‌ కాలేదు. నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో మొత్తం డివిజన్లు 60 ఉండగా.. బీజేపీ-28, కాంగ్రెస్‌-17, ఎంఐఎం-14, బీఆర్‌ఎస్‌ ఒకచోట గెలుపొందాయి. దీంతో మేయర్‌ పీఠంపై బీజేపీ, కాంగ్రెస్‌ ఫోకస్ పెట్టాయి.

అటు.. కొత్తగూడెం కార్పొరేషన్‌ రాజకీయం రసవత్తరంగా మారింది. కొత్తగూడెంలో మొత్తం 60 డివిజన్లు ఉండగా.. కాంగ్రెస్‌-22, సీపీఐ-22, బీఆర్‌ఎస్‌-8, ఇతరులు-6, బీజేపీ-1, సీపీఎం ఒక స్థానంలో గెలిచింది. ఏ పార్టీకి మ్యాజిక్‌ ఫిగర్‌ దక్కకపోవడంతో మేయర్‌ పీఠం కోసం కాంగ్రెస్‌, సీపీఐ పోటీ పడుతున్నాయి. ఇదిలా ఉంటే.. సీపీఐకి బీఆర్ఎస్‌ ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చింది. సింగరేణిపై పోరాటానికి మద్దతిస్తే కలిసి నడుస్తామంటూ బీఆర్‌ఎస్‌ గాలం వేసింది. అయితే.. దీనిపై ఇప్పటివరకు సీపీఐ నుంచి ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు.

మరోవైపు.. మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌లో కూడా హంగ్ ఏర్పడింది. మహబూబ్‌నగర్‌లో మొత్తం డివిజన్లు 60 కాగా.. కాంగ్రెస్‌-29, బీఆర్‌ఎస్‌-14, బీజేపీ-9, ఎంఐఎం-3, ఇతరులు 5 స్థానాల్లో గెలుపొందారు. ఏ పార్టీకి మ్యాజిక్‌ ఫిగర్‌ 31 దక్కలేదు. అయితే.. మేయర్‌ పీఠంపై కాంగ్రెస్‌ కన్నేసింది. అందుకు తగ్గట్టుగా పావులు కదుపుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story