water projects : సాగునీటి కోసం ఎంత ఖర్చయినా పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధం: సీఎం

water projects : సాగునీటి కోసం ఎంత ఖర్చయినా పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధం: సీఎం
x
Highlights

water ప్రాజెక్ట్స్ : రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించడానికి మించిన ప్రాధాన్యం ప్రభుత్వానికి మరోటి లేదని, దీనికోసం ఎంత ఖర్చయినా పెట్టడానికి సిద్ధంగా...

water ప్రాజెక్ట్స్ : రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించడానికి మించిన ప్రాధాన్యం ప్రభుత్వానికి మరోటి లేదని, దీనికోసం ఎంత ఖర్చయినా పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి రాష్ట్రంలో నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టుల ద్వారా వచ్చే నదీ జలాలను వీలైనంత ఎక్కువ వ్యవసాయ భూములకు అందించే విధంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రాజెక్టుల నీటితో ముందుగా చెరువులు నింపాలని, తర్వాత రిజర్వాయర్లు నింపాలని, చివరికి ఆయకట్టుకు అందించాలని సీఎం తెలిపారు.

వివిధ ప్రాజెక్టుల కాల్వల ద్వారా ఇప్పటి వరకు సాగునీరు అందని ప్రాంతాలను గుర్తించి, వాటికి సాగునీరు అందించే ప్రణాళికపై ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు కెటీఆర్, కొప్పుల ఈశ్వర్, ఎస్. నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఉద్యమ స్పూర్తితో చెరువులను పునరుద్ధర చేయ్యడం వల్ల వీలైనంత ఎక్కువ వ్యవసాయ భూములకు సాగునీరు అందించడమే మార్గంగా పనలు చేశామన్నారు. కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టుల వల్ల ఇప్పుడు పుష్కలంగా నీటి లభ్యత ఏర్పడిందని స్పష్టం చేశారు. భూగర్భ జలమట్టం పెరిగి రైతులు దాదాపు 45 వేల కోట్ల వ్యయం చేసి వేసుకున్న బోర్లకు నీరందుతుందని సీఎం వెల్లడించారు. కోటికి పైగా ఎకరాలకు సాగునీరు అందించే గొప్ప వ్యవస్థ ఏర్పడిందని, వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంతో పాటు, దాన్ని సమర్థవంతంగా నిర్వహించడం కూడా చాలా ముఖ్యమని సీఎం అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories