కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తో తెలంగాణ మంత్రులు భేటి.. ధాన్యం కొనుగోళ్లపై చర్చిస్తున్న మంత్రులు

* 7.30కి జరగాల్సిన సమావేశం 8.30కి మొదలు * ఎంతమొత్తంలో ధాన్యం కొనుగోలు చేస్తారో కాసేపట్లో క్లారిటీ

Shilpa
Published on: 26 Nov 2021 9:04 PM IST
Telangana Ministers Meeting with Union Food Minister Piyush Goyal
X

కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తో తెలంగాణ మంత్రులు భేటి(ఫైల్ ఫోటో)

TS Meeting: కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో తెలంగాణ మంత్రులు సమావేశమయ్యారు. ఖరీఫ్, రబీలో ఎంతమొత్తంలో ధాన్యం కొనుగోలు చేస్తారో చర్చిస్తున్నారు. కాసేపట్లో దీనిపై క్లారిటీ రానుందని తెలుస్తోంది. మంత్రి పీయూష్ గోయల్‌ తెలంగాణ మంత్రులకు 7.30 గంటలకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు.

కానీ ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్న మంత్రి 8.30 తర్వాత తెలంగాణ మంత్రులతో సమావేశమయ్యారు. సెంట్రల్‌ మినిస్టర్‌ ను కలిసిన వారిలో హోంమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, ఎంపీలు, బీబీ పాటిల్, నామా నాగేశ్వరరావు, సురేష్ రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌ కుమార్ ఉన్నారు.

Shilpa

Shilpa

Next Story