Talasani Srinivas Yadav: రఫేల్ గురించి మాట్లాడితే సర్జికల్ స్ట్రయిక్స్ అంటారేంటి?

Talasani Srinivas Yadav: కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తలసాని సవాల్

Rama Rao
Updated on: 14 Feb 2022 4:01 PM IST
Telangana Minister Talasani Srinivas Yadav Comments on BJP
X

Talasani Srinivas Yadav: రఫేల్ గురించి మాట్లాడితే సర్జికల్ స్ట్రయిక్స్ అంటారేంటి?

Talasani Srinivas Yadav: అత్యంత రహస్యమైన డిఫెన్స్ విషయాలను బీజేపీ నేతలు రాజకీయాల కోసం వాడుకుంటున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రఫేల్ విషయాల గురించి మాట్లాడితే సర్జికల్ స్ట్రయిక్స్ అంశాన్ని ప్రస్తావిస్తున్నారని, కేంద్రంలో ఉన్న మంత్రులకు బద్ధుందా అంటూ ఘాటుగా విమర్శించారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీద రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిగా ఎన్నికై మూడేళ్లు కావస్తున్నా సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఏం చేశారంటూ ప్రశ్నించారు. వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ 850 కోట్లు కేటాయిస్తే కేంద్రమంత్రిగా ఒక్క రూపాయైనా తీసుకొచ్చారా అంటూ ప్రశ్నించారు.

Rama Rao

Rama Rao

Next Story