CM Jagan: వైఎస్సార్‌, జగన్‌పై తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి హాట్‌ కామెంట్స్‌

CM Jagan: పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణానీటిని తరలించి వైఎస్సార్‌ నీటిదొంగ అయ్యారు -మంత్రి

Sandeep Eggoju
Published on: 22 Jun 2021 4:07 PM IST
Telangana Minister Prashanth Reddy Hot Comments on YSR, and CM Jagan
X

మంత్రి ప్రశాంత్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

CM Jagan: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి. పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా నీటిని తరలించి, ఆనాడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నీటి దొంగ అయ్యాడు. ఇవాళ వారి కొడుకైనా మారాడనుకుంటే లంకలో ఉన్నవాళ్లంతా రాక్షసులే అన్నట్టు.. సీఎం జగన్‌ దొంగతనంగా ప్రాజెక్టులు కడుతున్నారని విమర్శించారు. రాయలసీమ ప్రాజెక్ట్, ఆర్డీఎస్‌ రైట్‌ కెనాల్‌ కట్టి జగన్‌ గజదొంగ అయ్యారంటూ వ్యాఖ్యానించారు మంత్రి ప్రశాంత్‌రెడ్డి. ఆంధ్రోళ్లు ఎవరైనా తెలంగాణకు వ్యతిరేకమేనని అన్నారు ప్రశాంత్‌రెడ్డి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story